Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నా పేరు సూర్య' విడుదల తేదీని ఖరారు చేసేశారు!

  • 'భరత్ అను నేను' రిలీజ్ డేట్ ఖరారు 
  • ఏప్రిల్ 27వ తేదీన విడుదల
  • 'నా పేరు సూర్య' విడుదల తేదీపై సందేహాలు 
  • ముందుగా చెప్పిన తేదీలో మార్పు లేదన్న బన్నీ వాసు      
వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా షూటింగును మొదలెట్టిన కొన్ని రోజులకే, వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన దీనిని విడుదల చేయనున్నట్టుగా చెప్పారు.

ఇక కొరటాల శివ .. మహేశ్ కాంబినేషన్లో 'భరత్ అను నేను' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టుగా రీసెంట్ గా ప్రకటించారు. దాంతో 'నా పేరు సూర్య' విడుదల వాయిదాపడి ఉంటుంది .. అందువల్లనే ఆ డేట్ లో మహేశ్ మూవీ వస్తోందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో 'నా పేరు సూర్య' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బన్నీవాసు మాట్లాడుతూ, ముందుగా చెప్పినట్టుగానే తమ సినిమా ఏప్రిల్ 27నే వస్తుందని స్పష్టం చేశాడు. రెండు భారీ సినిమాలు ఒకే రోజున విడుదలవుతుండటం ఆసక్తిని రేకెత్తించే అంశమే.     
allu arjun

More Telugu News